|
|
||
|
మైదుకూరు - రాయలసీమలోని ఒక ప్రముఖ కూడలి కేంద్రం - అభివృద్ధీ, ఆధునీకరణలు వేగవంతంగా చోటు చేసుకుంటున్న కడప జిల్లాలోని ఒక నియోజకవర్గం. మైదుకూరు,ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగాలు.
తెలుగు గంగ, కె.సి.కెనాల్ పంట కాలువలూ, చెరువులూ, దొరవులూ, వాగులూ, వంకలూ, పచ్చటి పైర్లూ, నల్లమల అడవులూ, ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన సొగసును చేకూరుస్తుంటాయి. ఈ ప్రాంత విలక్షణ జీవవైవిధ్యానికి కె.పి.ఉల్లి ,ఎర్రచందనం నిదర్శనాలు. శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం, ఈ అభయారణ్యాన్ని ఆవాసంగా చేసుకున్న కలివికోడి - మైదుకూరు నియోజకవర్గానికి ప్రత్యేకతను సంతరించిపెడుతున్నాయి. పెన్న, కుందూ నదుల హొయలు మైదుకూరు ప్రాంత నైసర్గిక శోభను ఇనుమడింపచేస్తున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పుష్పగిరి, బ్రహ్మంగారిమఠంలతో పాటు అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయం, నాగనాధేశ్వరకొండ, ముక్కొండ మల్లేశ్వర దేవస్థానం, భైరవకోన, మైదుకూరులోని మాధవరాయ స్వామి దేవస్థానం, అంకాలమ్మ గుడి, సాయిబాబా గుడి, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిశాల, శ్రీ ముడుమాల సిద్దయ్య, దుంపలగట్టు అంకాలమ్మ దేవస్థానం, యెల్లంపల్లె తిరుమలనాధాలయం, వనిపెంట చెన్నకేశవాలయం, రాష్ట్రంలొ ఎత్తైన మసీదుల్లో ఒకటిగా పేరుగాంచిన మైదుకూరు షాహి మసీదు, క్రైస్తవ క్షేత్రం కరుణగిరిలు మైదుకూరు నియోజక వర్గంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.
కాలఙ్ఞాన కర్త వీరబ్రహ్మేంద్ర స్వామి-శిష్యుడు సిద్దయ్య-మనువరాలు ఈశ్వరాంబ, అవధూత నారాయణ స్వామి, పిచ్చమాంబ, లింగాలదిన్నె బ్రహ్మస్వామి, కక్కయ్య స్వామి, పుల్లయ్య స్వామి, కేశాలు స్వామి, వెర్రెమ్మ, కొండయ్య స్వామి లాంటి అవతార మూర్తులకు ఆలవాలమైన నేల మైదుకూరు ప్రాంతం. |
సౌజన్యం,సాంకేతిక సహకారం:
|
|---|---|---|